ధర్మ మార్గమే రక్షణ కవచమై కాపాడుతుంది

సమస్త విశ్వాన్ని నడిపించే భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఆయన శక్తికి ఎదురులేదు .. తిరుగులేదు. అలాంటి భగవంతుడు సమస్త జీవరాశి యందు దయను కలిగి ఉంటాడు. ఎవరిని కూడా శిక్షించాలనే కోరిక ఆయనకి ఉండదు. తనకి ప్రీతికరమైన ధర్మ మార్గంలో నడిచే వారిపట్ల ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడు. అందుకు వ్యతిరేకంగా అధర్మంగా వ్యవహరించేవారిని మంచి దారి వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినవారు మాత్రమే తగిన మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. అందుకు ఎన్నో నిదర్శనాలు ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తూ ఉంటాయి.

 సీతమ్మవారిని అపహరించిన రావణుడు ఆమెను 'అశోకవనం'లో ఉంచుతాడు. హనుమను దూతగా పంపిన రాముడు .. రావణుడికి ఒక హెచ్చరిక చేస్తాడు. అయినా రావణుడు వినిపించుకోకపోతే, మరో అవకాశాన్ని ఇస్తూ విభీషణుడితో చెప్పిస్తాడు. చివరికి రణరంగంలోను మారడానికి రావణుడికి మరో అవకాశం ఇచ్చి పంపుతాడు. అయినా రావణుడు అధర్మ మార్గాన్నే ఆశ్రయించి ఉండటంతో, రాముడి చేతిలో సంహరించబడతాడు.     


More Bhakti News