అనుగ్రహించే అమ్మవారు శ్రీ లలితాదేవి
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు శ్రీ లలితాదేవిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. పద్మం .. అంకుశం .. ధ్వజం .. చక్రమనే చిహ్నాలతో అమ్మవారు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీలలితాదేవి తన పేరుకు తగినట్టుగానే వెన్నవంటి మనసును కలిగి ఉంటుంది. అమ్మా అని ఆర్తితో పిలిస్తే చాలు .. ఆదుకోవడానికి తక్షణమే సిద్ధమవుతూనే ఉంటుంది. అందుకే శ్రీ లలితాదేవిని కొలిచే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
అనునిత్యం లలితాదేవి నామాన్ని స్మరించుకోవడం వలన .. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన .. లలితా సహస్ర నామం చదవడం వలన ఆ తల్లి ప్రీతి చెందుతుందని అంటారు. ఆపదలో .. అత్యవసరాల్లో .. ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో .. అనారోగ్య సమస్యలతో వున్న తన భక్తులను ఆ తల్లి తన కంటి చూపుతోనే గట్టెక్కిస్తుంది. లలితా సహస్ర నామం చదువుతూ ఉన్నంతసేపు మాత్రమే కాదు, ఆ తరువాత కూడా అది ఒక రక్షణ కవచం మాదిరిగా రక్షిస్తూ ఉంటుంది. అందుకే లలితాదేవి అమ్మవారిని దర్శించాలి .. స్మరించాలి .. సేవించాలి .. తరించాలి.