కష్టాలను ఎదిరించడం వల్లనే విజయం సొంతమవుతుంది!

జీవితంలో ఎప్పుడూ ఏ సందర్భంలోను కష్టాలు .. బాధలు ఎదురుకాకూడదనే చాలామంది కోరుకుంటూ వుంటారు. ఎప్పుడూ సుఖాలు .. సంతోషాలు వుండాలని ఆశపడుతుంటారు. కానీ కష్టాలను ఎదిరించి విజయాలను సాధించినప్పుడే అసలైన ఆనందం కలుగుతుందనే విషయాన్ని చాలామంది గ్రహించరు. శ్రీరాముడిగా మానవ అవతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు .. మరెన్నో బాధలను అనుభవించాడు.

 ఎప్పుడైనా ఏదైనా కష్టం ఎదురైనప్పుడు శ్రీరాముడు పడిన కష్టాల ముందు తాము పడేది ఏపాటి అనుకుంటే చాలు .. మనసు కాస్త కుదుట పడుతుంది. శ్రీరాముడు అంతటి కష్టాలను అనుభవించాడు. అయినా ఆయన కుంగిపోకుండా ధైర్యంగా ముందుకుసాగాడు. సముద్రాన్ని సైతం దాటి .. అతి బలవంతులైన అసురులను సంహరించి, విజయంతో వెనుదిరిగాడు. అందువల్లనే కష్టాలు రాకూడదని కాకుండా .. వాటిని ఎదిరించే శక్తిని ఇవ్వమని భగవంతుడిని ప్రార్ధించాలి.  


More Bhakti News