ఆర్ధిక పరమైన కష్టాలు ఇలా కూడా తీరతాయి

ఆర్ధిక పరమైన ఇబ్బందులు జీవితాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ ఆ సమస్య నుంచి బయటపడటానికి తమ వంతు కృషి చేస్తుంటారు. భగవంతుడికి చేసే సేవ ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని అనునిత్యం శుభ్రం చేసి .. ముగ్గు పెట్టి .. అక్కడి తులసి కోటలో దీపం పెట్టవలసి ఉంటుంది.

అలాగే పూల మొక్కలను ఆలయ ప్రాంగణంలో పెట్టి .. అనునిత్యం వాటికి నీళ్లు పోస్తూ .. ఆ పూలను భగవంతుడికి సమర్పించవలసి ఉంటుంది. ఇక ఆలయం విశాలమైనదై .. అక్కడ చిన్న తోట లాంటిది వుంటే, రెండు అరటి మొక్కలు నాటడం మంచిది. ప్రతి రోజు ఆ మొక్కలను నీళ్లు పోసి సంరక్షణ చేస్తూ ఉండాలి. అరటి పండ్ల గెలలు తయారు కాగానే .. ముందుగా వాటికి దైవానికి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆదాయ మార్గాలలోని అవరోధాలు తొలగిపోతాయి .. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి .. ఆర్ధికపరమైన అభివృద్ధి కనిపిస్తుంది.   


More Bhakti News