సమస్త పాపాలను నశింపజేసే రామేశ్వరంలోని పుణ్య తీర్థాలు

రామేశ్వరం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం .. జీవితంలో ఒక్కసారైనా రామేశ్వరాన్ని దర్శించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వాల్మీకీ రామాయణం .. వ్యాస భారతం .. ఆధ్యాత్మిక రామాయణం .. మొల్ల రామాయణం .. ఆనంద రామాయణం .. తులసీ రామాయణంతో పాటు వివిధ పురాణాలు రామేశ్వర క్షేత్రం యొక్క విశిష్టతను గురించి ప్రస్తావించాయి. రామేశ్వర క్షేత్రాన్ని దర్శించిన భక్తులు ముందుగా సముద్ర స్నానాన్ని ఆచరించి, ఆ తరువాత ఇక్కడ గల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తుంటారు.

 మహాలక్ష్మీ తీర్థం .. సావిత్రి తీర్థం .. గాయత్రీ తీర్థం .. సరస్వతీ తీర్థం .. సేతుమాధవ తీర్థం .. గంధమాదన తీర్థం .. కవచ తీర్థం .. గవయ తీర్థం .. నల తీర్థం ..  నీల తీర్థం .. శంఖ తీర్థం .. చక్రతీర్థం .. బ్రహ్మహత్యా పాతక విమోచన తీర్థం .. సూర్య తీర్థం .. చంద్ర తీర్థం .. గంగా తీర్థం .. యమునా తీర్థం .. గయా తీర్థం .. శివతీర్థం .. సత్యామృత తీర్థం .. సర్వతీర్థం .. కోటి తీర్థం .. అనే 22 తీర్థాలలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఒక్కో తీర్థం వెనుక ఒక్కో విశేషం కనిపిస్తూ ఉంటుంది .. ఆ తీర్థం స్నాన మహిమ వినిపిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుణ్య తీర్థాల స్నానం సమస్త పాపాలను నశింపజేసి .. సకల దోషాలను తొలగిస్తుంది .. అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుంది.        


More Bhakti News