సమస్త దోషాలను తొలగించే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన

పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు. తారకాసురుడి సంహారం కోసం .. తద్వారా లోక కల్యాణం కోసం ఆయన జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన 'మార్గశిర శుద్ధ షష్ఠి' రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామినే కార్తికేయుడు .. స్కందుడు .. షణ్ముఖుడు .. మురుగన్ .. అని అంటారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠినే కార్తికేయ షష్ఠి .. కుమార షష్ఠి .. స్కంద షష్ఠి వంటి పేర్లతో పిలుస్తుంటారు.

ఇక స్వామి తమవాడు అనే ఆత్మీయ భావనతో అంతా కూడా 'సుబ్బారాయుడి షష్ఠి' అని పిలుచుకోవడం కూడా విశేషంగా అనిపిస్తుంది. ఈ రోజున భక్తులంతా పూజా మందిరంలోని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఆలయానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుని అభిషేకాలు చేయిస్తారు. స్వామివారికి ఇష్టమైన పండ్లు .. పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు .. సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.      


More Bhakti News