మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడికి ఆవు పాలతో అభిషేకం

తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ 'సంక్రాంతి'. ఇది రైతుల పండుగ .. గ్రామాలను కళకళలాడేలా చేసే పండుగ. ధాన్యం ఇంటికి చేరుకున్న సందర్భంగా, ధాన్యలక్ష్మి' తమ ఇంటికి వచ్చిందనే సంతోషంతో ఈ పండుగ జరుపుకుంటూ వుంటారు. పంటలు బాగా పండటానికి కారకుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. వ్యవసాయంలో తమకి సహకరించిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

కొత్తగా వచ్చిన ధాన్యంతో వివిధ రకాల వంటలు చేసి, భగవంతుడికి నైవేద్యాలు సమర్పించి, వాటిని ప్రసాదంగా స్వీకరిస్తుంటారు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించే పర్వదినం కనుకనే దీనిని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగలు .. ఈ కారణంగా చేసిన పూజలకు విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజున అరుణోదయ వేళలో తలస్నానం చేసి .. సూర్య భగవానుడికి పాలతో అభిషేకం చేయాలి. అలాగే పరమశివుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయాలి. ఈ విధంగా చేయడం వలన, ఆయురారోగ్యాలు లభిస్తాయనేది పెద్దల మాట.      


More Bhakti News