మాఘ శుద్ధ చతుర్థి ప్రత్యేకత అదే

పవిత్ర మాసాలుగా చెప్పబడినవాటిలో 'మాఘ మాసం' ఒకటి. ఈ మాసంలో తెల్లవారు జామున చేసే స్నానాల వలన .. సూర్యారాధన వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయనేది మహర్షుల మాట. ఈ మాసంలో వచ్చే చవితిని .. అంటే మాఘ శుద్ధ చవితిని 'వర చతుర్థి' .. 'తిల చతుర్థి' ..  'కుంద చతుర్థి' అని పిలుస్తుంటారు.

'వర చతుర్థి' రోజున గణపతిని పూజించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. ఇక ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయట. అందువలన దీనిని 'తిల చతుర్థి' అని కూడా అంటారు. ఇక ఈ 'కుంద చతుర్థి' రోజున శివుడిని 'మొల్ల' పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన ఫలాలు లభిస్తాయని చెబుతారు.  


More Bhakti News