శ్రీపంచమి రోజున సరస్వతీ దేవి ఆరాధన

సరస్వతీదేవికి తెలుపు వర్ణం అంటే ఇష్టం .. అందువలన ఆ తల్లి తెల్లని వస్త్రాలు ధరించి .. హంస వాహినియై దర్శనమిస్తూ ఉంటుంది. పాల నుంచి నీళ్లను హంస వేరుచేస్తుందని అంటారు. అలాగే మనసులోని చీకట్లకు కారణమయ్యే అజ్ఞానాన్ని కూడా అమ్మవారు తొలగిస్తుందని చెబుతారు. అందువల్లనే దేవతలు .. మహర్షులు .. మానవులు సరస్వతీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.

ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన మాఘశుద్ధ పంచమిని 'శ్రీపంచమి' గా పిలుస్తుంటారు. ఈ రోజున అమ్మవారి జయంతిగా భావించి ఆరాధిస్తుంటారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, పాఠ్య పుస్తకాలను .. పెన్నులను పూజా మందిరంలో .. అమ్మవారి సన్నిధిలో ఉంచాలి. అంకితభావంతో అమ్మవారిని అర్చించి .. జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్ధించాలి. దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కారణంగా విద్య వృద్ధి చెందుతుంది .. ఉత్తమమైన మార్గం కనిపిస్తుంది .. ఉన్నతమైన జీవితం లభిస్తుంది.   


More Bhakti News