రథ సప్తమి రోజున సూర్యారాధన

పవిత్రమైన మాసాలుగా చెప్పుకునే వాటి జాబితాలో మనకి 'మాఘ మాసం' కూడా కనిపిస్తుంది. మాఘమాసం శ్రీ మన్నారాయణుడికి .. ఆయన స్వరూపమైన సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నదులలోగానీ .. చెరువుల్లో గాని మాఘ స్నానం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయనేది పెద్దల మాట. అలాంటి మాఘమాసంలో వచ్చే సప్తమిని 'రథ సప్తమి'గా చెబుతూ వుంటారు.

 ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుడిని ఆరాధించే పర్వదినంగా 'రథ సప్తమి' కనిపిస్తూ ఉంటుంది. 'రథ సప్తమి' రోజున ఏడు తెల్ల జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుందని అంటారు. ఈ రోజున సూర్యభగవానుడిని పూజించడం వలన, వివిధ రకాల వ్యాధులు నశిస్తాయి. ఈ జన్మలోనే కాకుండా అంతకు ముందు జన్మలలో చేసిన పాపాలు సైతం తొలగిపోతాయనేది మహర్షుల మాట.       


More Bhakti News