ఈ క్షేత్రంలో లవకుశుల పాద ముద్రలు కనిపిస్తాయట

సీతారాములు నడయాడిన పుణ్య ప్రదేశాలుగా చాలా ప్రాచీన క్షేత్రాలు కనిపిస్తాయి. కొన్ని క్షేత్రాల్లో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు కనిపిస్తుంటాయి. మరికొన్ని క్షేత్రాల్లో శ్రీరాముడు .. సీతాదేవి పాదముద్రలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. అలా లవకుశుల పాద ముద్రలు కనిపించే క్షేత్రం కూడా వుంది .. అదే శ్రీ పళ్లికొండేశ్వర స్వామి క్షేత్రం. 'సురుటిపల్లె'లో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. దేవతలు తరలివచ్చిన కారణంగా ఈ ప్రదేశం 'సురులపల్లె' అయిందనీ .. కాలక్రమంలో 'సురుటి పల్లె'గా మారిందని అంటారు.

పరమశివుడు శయణమూర్తిగా కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. హాలాహలాన్ని కంఠంలో దాచుకున్న పరమశివుడు, ఆ విష ప్రభావం కారణంగా ఇక్కడ కాసేపు అమ్మవారి ఒడిలో సేదదీరాడని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలోనే శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ స్వామిని 'రామలింగేశ్వరుడు'గా కొలుస్తుంటారు. పూర్వం సీతాదేవితో పాటు లవకుశులు .. లక్ష్మణ .. భరత.. శత్రుఘ్ను .. హనుమలతో శ్రీరాముడు ఈ క్షేత్రానికి వచ్చినట్టుగా స్థానికులు చెబుతారు. ఇక్కడ కనిపించే చిన్న చిన్న పాద ముద్రలు లవకుశులవేనని విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్రంలో ఇదొక విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. 


More Bhakti News