పంపాదేవిగా పార్వతీదేవి తపస్సు చేసింది ఇక్కడేనట

జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడదగిన ప్రదేశాల్లో 'హంపి' ఒకటి. చరిత్ర .. ఆధ్యాత్మికత కలగలిసిన పవిత్రమైన ప్రదేశంగా .. తుంగభద్ర నదీ తీరంలో 'హంపి' కనిపిస్తుంది. చరిత్రకు సాక్షిగా నిలుస్తూ .. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే శిల్పకళతో 'హంపి' దర్శనమిస్తూ ఉంటుంది. కర్ణాటక - హోస్పేట సమీపంలో 'హంపి' అలరారుతోంది. రామాయణ కాలంలోని కొన్ని సంఘటనలు ఈ ప్రదేశంలోనే జరిగాయని చెబుతుంటారు. సుగ్రీవుడిని కలుసుకున్న తరువాత, శ్రీరామచంద్రుడు కొంతకాలం పాటు ఇక్కడే వున్నాడని అంటారు.

ఇక్కడే 'పంపా సరోవరం' దర్శనమిస్తుంది. ఈ సరోవరానికి ఈ పేరు రావడానికి కారణం పార్వతీదేవి అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పంపాదేవిగా బ్రహ్మదేవుడి కుమార్తెగా జన్మించిన పార్వతీదేవి, పరమశివుడి కోసం ఈ సరస్సు తీరంలో కఠోర తపస్సు చేసి, ఆయనను భర్తగా పొందిందనేది స్థలపురాణంగా వినిపిస్తుంది. అందువల్లనే ఈ సరోవరానికి 'పంపా సరోవరం' అనే పేరు వచ్చిందని అంటారు. ఇక భక్తులు ఇక్కడి విరూపాక్ష స్వామిని 'పంపాపతి'గానే కొలుస్తుండటం విశేషం.      


More Bhakti News