ద్వాదశ ఆదిత్యులు వీరే

సమస్త జీవరాశికి పోషకుడిగా .. ఆరోగ్య ప్రదాతగా ప్రాచీనకాలం నుంచి సూర్యభగవానుడిని ఆరాధించడం వుంది. వెలుగు రేఖలతో జీవులలో చైతన్యాన్ని కలిగిస్తూ .. ప్రత్యక్ష నారాయణుడిగా ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి సూర్యభగవానుడు కొలువుదీరిన ఎన్నో ప్రాచీన క్షేత్రాలు మనదేశంలో కనిపిస్తూ ఉంటాయి. సూర్యభగవానుడికి నమస్కరించి ఆ తరువాత చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుందనేది మహర్షుల మాట.

 పన్నెండు మాసాలలో పన్నెండు మంది ఆదిత్యులు సంచరిస్తూ ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'ధాత' .. 'అర్యముడు' .. 'మిత్రుడు' .. 'వరుణుడు' .. 'ఇంద్రుడు' .. 'వివస్వంతుడు' .. 'త్వష్టా' .. 'విష్ణువు' .. 'అంశుమంతుడు' .. 'భగుడు' .. 'పూషా' .. 'పర్జన్యుడు' అనే వీరినే 'ద్వాదశాదిత్యులు' అంటారు. వరుస క్రమంలో ఈ ద్వాదశ ఆదిత్యులు చైత్ర .. వైశాఖ .. జ్యేష్ఠ .. ఆషాఢ .. శ్రావణ .. భాద్రపద .. ఆశ్వయుజ .. కార్తీక .. మార్గశిర .. పుష్య .. మాఘ .. ఫాల్గుణ మాసాలలో  సంచరిస్తూ వుంటారు.         


More Bhakti News