మహాశివరాత్రి రోజున ఒక్కో జాములో ఒక్కో అభిషేకం

పరమశివుడి నామాన్ని ఎప్పుడు స్మరించినా పుణ్యమే .. ఎప్పుడు పూజించినా మోక్షదాయకమే. ఇక ఆ దేవదేవుడిని మహాశివరాత్రి రోజున ఆరాధించడం వలన, అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున శివపూజతో పాటు ఉపవాసం .. జాగరణ చేయాలనే నియమం వుంది. ఈ రోజున స్వామివారికి సంపెంగలు .. మొగలి పువ్వులతో కాకుండా, ఆయనకి ఇష్టమైన వివిధ రకాల పూలతో పూజించాలి.

 మహాశివరాత్రి రోజున నాలుగు జాముల్లోను నాలుగు మార్లు అభిషేకాలు చేయవలసి ఉంటుంది. తొలి జాములో పాలతోను .. రెండవ జాములో పెరుగుతోను .. మూడవ జాములో నేతితోను .. నాల్గొవ జాములో తేనెతోను శివలింగాన్ని అభిషేకించవలసి ఉంటుంది.  అలా రాత్రంతా ఆ సదాశివుడిని స్మరిస్తూ .. కీర్తిస్తూ జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయం ఆ స్వామిని పూజించి .. నైవేద్యాలు సమర్పించాలి. అలా మహాశివరాత్రి రోజున ఆ దేవ దేవుడిని పూజించడం వలన, శివాలయాలు .. శైవ క్షేత్రాలు దర్శించడం వలన సమస్త పాపాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.    


More Bhakti News