ఫాల్గుణ పౌర్ణమి ప్రత్యేకత ఇదే

ప్రతి మాసంలోని పౌర్ణమికి ఓ ప్రత్యేకత .. విశిష్టత ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే పూజలకు విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా 'మహా ఫాల్గుణి' అని పిలువబడే ఫాల్గుణ పౌర్ణమి రోజుకి కూడా ఓ విశిష్టత వుంది. మదురైలో కొలువైన మీనాక్షీదేవి అమ్మవారు .. సుందరేశ్వర స్వామి కోసం తపస్సు చేసి ఆయనను భర్తగా పొందినది ఈ రోజునే అని స్థల పురాణం చెబుతోంది.

ఈ పౌర్ణమిని 'హోళికా పూర్ణిమ' అని కూడా అంటారు. పరమశివుడు తన ధ్యానానికి భంగం కలిగించిన మన్మధుడిని మూడవ కంటితో భస్మం చేసింది ఈ రోజునే. మన్మథుడికి కాముడు అనే పేరు కూడావుంది. అందువలన దీనిని 'కాముని పున్నమి' అని కూడా అంటారు. ఈ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు గనుక 'వసంతోత్సవం' అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున సదాశివుడిని .. శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.     


More Bhakti News