సమస్త దోషాలను తొలగించే సుబ్రమణ్యుడు

అనేక ప్రాంతాల్లో ప్రధాన దైవంగాను .. ఉపాలయాలలోను సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. భక్తులచే నిత్యపూజలు అందుకుంటూ .. ధర్మబద్ధమైన వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. అందువల్లనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు .. ఆయన అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు. అలా స్వామి పూజాభిషేకాలు అందుకునే క్షేత్రాలలో అనంతపురం జిల్లా పరిధిలోని 'పంపనూరు ' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడ స్వామి పాము రూపంలో కొలువై ఉంటాడు కనుక, పూర్వం ఈ ఊరు .. 'ఫణి పూరు'గా పిలవబడుతూ ఉండేదట. కాలక్రమంలో అదికాస్తా .. 'పంపనూరు'గా మారిందని అంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే .. రాహు .. కేతు .. కుజ .. సర్ప దోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. స్వామిని అంకిత భావంతో సేవించడం వలన ఆపదలు ..  అనారోగ్యాలు దరిచేరవని చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం విశేషం .   


More Bhakti News