కష్టనష్టాలు తొలగిపోయేవే

జీవితంలో ఎంతటివారికైనా కష్టనష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో బాధపడటమో .. భయపడటమో జరుగుతూనే ఉంటుంది. ఆ కష్టంలో ధైర్యం చెప్పేవాళ్లు లేకపోతే మరింతగా ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. కష్టనష్టాలు దరిచేరినప్పుడు .. సమస్యలు చుట్టిముట్టినప్పుడు కంగారుపడిపోకుండా చిన్నపాటి ఆలోచన చేయగలిగితే వాటిని ఎదుర్కోగలగడం తేలిక అవుతుందనేది పెద్దల మాట.

ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకుంటాయి .. సూర్యుడి కాంతిని సైతం అడ్డుకుంటూ చీకట్లు కమ్ముకునేలా చేస్తాయి. అయితే అవి అలా ఎంతో సేపు నిలవలేవు.. చూస్తుండగానే దూది పింజల్లా తొలగిపోతాయి. నరకబడిన చెట్టు ఎప్పటికీ అలాగే ఉండిపోదు .. ఆశలు రెక్కలు విప్పుకుంటున్నట్టుగా మళ్లీ చిగుర్చుతూనే ఉంటుంది. క్షీణిస్తూ వెళ్లిన చంద్రుడు .. మళ్లీ వృద్ధి చెందుతూనే ఉంటాడు. ఈ విషయాలన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే .. మన కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రావడానికి ఎక్కువ సమయం పట్టదనే విషయం అర్థమైపోతుంది. అప్పుడు మనసు కుదుట పడుతుంది .. మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది.        


More Bhakti News