చైత్ర మాసంలో దేవతారాధన

పవిత్రమైన మాసాలలో చైత్రమాసం ఒకటిగా కనిపిస్తుంది .. మహిమాన్వితమైన మాసమని అనిపిస్తుంది. అలాంటి ఈ మాసాన శుక్ల పక్షంలో వివిధ దేవతలను పూజించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. చైత్ర మాసంలోని 'పాడ్యమి' రోజున బ్రహ్మదేవుడిని .. 'విదియ ' రోజున ఉమాశంకరులను .. 'తదియ' రోజున కూడా పార్వతీ పరమేశ్వరులను .. 'చవితి' రోజున గణపతిని .. 'పంచమి' రోజున నాగదేవతలను .. 'షష్ఠి' రోజున కుమార స్వామిని పూజించాలి.

ఇక 'సప్తమి' రోజున సూర్యభగవానుడిని .. 'అష్టమి' రోజున మాతృ దేవతలను .. 'నవమి' రోజున మహిషాసుర మర్ధిని అమ్మవారిని .. 'దశమి' రోజున ధర్మరాజును ఆరాధించాలి. 'ఏకాదశి' రోజున మహర్షులను .. 'ద్వాదశి' రోజున శ్రీమహావిష్ణువును .. 'త్రయోదశి' రోజున మన్మథుడిని .. 'చతుర్దశి' రోజున శివుడిని .. 'పౌర్ణమి' రోజున శచీ ఇంద్రులను పూజించవలసి ఉంటుంది. ఇలా ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు .. సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.        


More Bhakti News