చైత్ర మాసం విశేషాలు

పవిత్రమైన మాసాలలో 'చైత్ర మాసం' ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. చైత్ర మాసపు తొలిరోజు నుంచే శ్రీరామ నవరాత్రులు మొదలవుతాయి. ఈ నవరాత్రుల సమయంలో ఏ రామాలయం చూసినా పందిళ్లు వేయబడి, భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. దూరప్రాంతాలకి వెళ్లిన వాళ్లు చాలామంది, తమ ఊరిలో జరిగే సీతారాముల కల్యాణానికి తప్పకుండా వస్తుంటారు. రామాయణ ఘట్టాలలో కొన్ని చైత్రమాసంతో ముడిపడి ఉండటం విశేషం.

శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించి .. అయోధ్య నగరవాసులకు ఆనందాన్ని కలిగించాడు. తండ్రి కోరికమేరకు సీతను వెంటబెట్టుకుని శ్రీరాముడు వనవాసానికి బయలుదేరింది చైత్రమాసంలోనే. దశరథుడు మరణించినదీ .. రామలక్ష్మణులు లేని సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించినది ఈ మాసంలోనే. రావణుడిని సంహరించిన అనంతరం విభీషణుడికి పట్టాభిషేకం జరిపించింది కూడా ఈ మాసంలోనే. సీతారాములు అయోధ్యానగరానికి చేరుకున్నది కూడా చైత్ర మాసంలోనే కావడం విశేషం. ఇలా చైత్ర మాసం .. రామాయణానికి సంబంధించిన అనేక ఘట్టాలతో ముడిపడి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.      


More Bhakti News