సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తరువాత ఇష్ట దేవతారాధన
చాలామంది ఉదయం నిద్రలేవగానే .. స్నానం చేసి పూజ చేసుకుంటారు. పూజ పూర్తయిన తరువాతనే తమ కార్యకలాపాలను మొదలుపెడుతుంటారు. ఎవరి ఇష్ట దేవతల పట్ల వాళ్లు పూర్తి విశ్వాసంతో వుంటారు. తమ దైవం అనుగ్రహంతోనే తమకి మంచి జరుగుతుందని భావిస్తుంటారు. తమ కుటుంబ సభ్యులను ఓ కంట కనిపెడుతూ తమకి శుభాలను కలగజేసేది ఆ దైవమేనని ఆశిస్తుంటారు. ఈ కారణంగానే తమ ఇష్టదేవతను అంకితభావంతో పూజిస్తూ .. నైవేద్యాలు సమర్పిస్తుంటారు.
అయితే ఎవరి ఇష్టదైవం ఎవరైనా .. ముందుగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పూజ ఆరంభించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడనీ .. సమస్త జీవరాశి పోషకుడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఆ స్వామికి అర్ఘ్యం ఇవ్వడం వలన .. భక్తితో నమస్కరించడం వలన ఇష్టదేవతారాధనకి అవసరమైన అధికారం లభిస్తుందనేది మహర్షుల మాట. ఇష్టదేవతల అనుగ్రహం త్వరగా లభిస్తుందని అంటారు. అందువలన సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తరువాత ఇష్టదేవతారాధన చేయడం మంచిది.