గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలలో దైవీ శక్తులు
గాయత్రీ మాత అయిదు ముఖాలతో .. పది భుజాలతో .. ప్రశాంత వదనయై దర్శనమిస్తుంది. సర్వ జగత్తుకు .. సర్వ వేదాలకు మాతృ స్వరూపిణిగా గాయత్రీదేవి కనిపిస్తుంది. అలాంటి గాయత్రీ మంత్రం మహాశక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. జపించినవారిని ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని అంటున్నాయి. గాయత్రీ మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి .. ఈ 24 బీజాక్షరాలు 24 దైవీ శక్తులకు ప్రతీకలు.
గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలలో దైవీ శక్తులుగా వినాయకుడు .. నరసింహస్వామి .. శ్రీమహావిష్ణువు .. శివుడు .. శ్రీకృష్ణుడు .. రాధాదేవి .. లక్ష్మీదేవి .. అగ్నిదేవుడు .. ఇంద్రుడు .. సరస్వతీదేవి .. దుర్గాదేవి .. హనుమంతుడు .. పృథ్వీదేవి .. సూర్యభగవానుడు .. శ్రీరాముడు .. సీతాదేవి .. చంద్రుడు .. యముడు .. బ్రహ్మదేవుడు .. వరుణుడు .. నారాయణుడు .. హయగ్రీవుడు .. హంసదేవత .. తులసీదేవి చెప్పబడుతున్నారు. గాయత్రీ మంత్రాన్ని సంధ్యా సమయంలో జపించబడుటచేత 'సంధ్యావందనం' అంటారు. అనునిత్యం గాయత్రీ మంత్రాన్నిజపించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ .. ఆపదలు తొలగిపోతాయనేది మహర్షుల మాట.