అందుకే శ్రీనివాసుడికి శనివారమంటే ఇష్టం

కలియుగ దైవంగా శ్రీనివాసుడు .. భక్తులచే అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకోవడానికి .. ఆ రోజున ఆ స్వామిని పూజించడానికి భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. అందుకు కారణం శనివారం ఆ స్వామికి ప్రీతికరమైనది కావడం వల్లనేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శనివారానికి .. శ్రీనివాసుడికి మధ్య విడదీయరాని అనుబంధం వుంది.

పద్మావతీదేవిని శ్రీనివాసుడు వివాహమాడినది .. స్వామి వక్ష స్థలాన లక్ష్మీదేవి నిలిచింది శనివారం రోజునే. శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞను ఇచ్చిన రోజు .. ఆలయంలోకి స్వామి వారు ప్రవేశించిన రోజు .. స్వామివారిని భక్తులు మొదటిసారిగా దర్శించుకున్నది శనివారం రోజునే. శ్రీనివాసుడిని పూజించేవారికి పీడించనని ఆ స్వామికి శనిదేవుడు మాట ఇచ్చింది కూడా శనివారమే. ఇలా శనివారమనేది స్వామివారితో ఇన్ని విధాలుగా ముడిపడి ఉండటం వల్లనే, ఆ స్వామిని భక్తులు శనివారం రోజున ఆరాధిస్తూ తరిస్తుంటారు.   


More Bhakti News