ఆపదలను తొలగించే నరసింహస్వామి

ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. హిరణ్యకశిపుడిని శిక్షించడం కోసం నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరిస్తూనే స్వామి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా స్వామివారు కొలువైన అరుదైన క్షేత్రాలలో ఒకటిగా అనంతపురం జిల్లాలోని 'కదిరి' కనిపిస్తుంది. నరసింహస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా .. అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఒకటిగా 'కదిరి' కనిపిస్తుంది.

ఈ స్వామిని శరణు కోరితే అండగా నిలుస్తాడనీ, ఆపదలను తొలగిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. దుష్ట శక్తుల బారి నుంచి .. గ్రహ పీడల నుంచి స్వామి రక్షిస్తాడని భావిస్తుంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేసి వస్త్రంతో తుడిచిన తరువాత, మూలమూర్తికి చమట పడుతుందట. అందువలన ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా వున్నాడని అంటారు. స్వామి దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు .. స్వామిని సేవించుకుని తన్మయత్వంతో తరిస్తూ వుంటారు.      


More Bhakti News