ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన మహర్షులు
అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ .. లోకంలో శాంతిని నెలకొల్పడంలోను, ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడంలోను మహర్షులు ప్రధానమైన పాత్రను పోషించారు. ధర్మబద్ధమైన .. సత్యవ్రతమైన జీవితాన్ని కొనసాగించినవారికే భగవంతుడి అనుగ్రహం దక్కుతుందని చాటి చెప్పారు. లోక కల్యాణం కోసం దైవీ శక్తులు భూమండలంనందు ఆవిర్భవించడానికి కారణభూతులయ్యారు.
ఆ మహర్షులు అందించిన గ్రంధాలు .. వాళ్ల వాక్కులు నేటికీ మానవులను ప్రభావితం చేస్తూనే వున్నాయి. అలాంటి మహర్షులలో కొంతమంది పేర్లు .. అత్రి మహర్షి .. అగస్త్య మహర్షి .. వశిష్ఠ మహర్షి .. వ్యాస మహర్షి .. భృగు మహర్షి .. జమదగ్ని మహర్షి .. గౌతమ మహర్షి .. కణ్వ మహర్షి .. కపిల మహర్షి .. దూర్వాస మహర్షి .. పరాశర మహర్షి .. శుక మహర్షి .. వాల్మీకి మహర్షి .. మృకండ మహర్షి .. సాందీపని మహర్షి .. యాజ్ఞవల్క్య మహర్షి .. మాండవ్య మహర్షి .. మార్కండేయ మహర్షి .. చ్యవన మహర్షి .. అంగీరస మహర్షి .. గర్గ మహర్షి.