దైవానుగ్రహంతో గురుదక్షిణ చెల్లించిన శిష్యుడు

పూర్వం గురుకులాల్లోనే విద్యాభ్యాసం జరిగేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకుని వెళ్లేవారు. తమకి విద్యను బోధించిన గురువులకు కృతజ్ఞతగా దక్షిణ ఇవ్వడమనేది ఒక ఆచారంగా ఉండేది. అలా ఒక గురుకులంలో హరిదాసు అనే శిష్యుడు విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. తన ప్రతిభాపాటవలతో హరిదాసు ఆ గురుకులానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు.

విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణ చెల్లించాలనుకుంటాడు హరిదాసు. కూతురు కోసమని ముత్యాల హారాన్ని గురుదక్షిణగా ఆ గురువుగారు అడుగుతారు. అయితే అంత స్థోమత లేకపోవడం వలన, త్యాగరాజస్వామి అనుగ్రహాన్ని కోరుతూ హరిదాసు తపస్సు చేయడం మొదలుపెడతాడు. ఆ స్వామి హరిదాసుకు అవసరమైన ముత్యాలహారం తీసుకుని మానవ రూపంలో అక్కడికి వస్తాడు. ఆ ముత్యాలహారాన్ని గురుదక్షిణగా చెల్లించడం కోసం తన ప్రాణాలను తీసుకోవడానికి కూడా హరిదాసు సిద్ధపడతాడు. అతని గురుభక్తికి మెచ్చిన స్వామి ఆ ముత్యాల హారాన్ని హరిదాసుకి ఇచ్చి అదృశ్యమవుతాడు.  


More Bhakti News