గోవు గొప్పతనం గురించి చెప్పిన చ్యవన మహర్షి
మహర్షిలలో 'చ్యవన మహర్షి'కి ప్రత్యేకమైన స్థానం వుంది. నీటిలోను ఆయన తపస్సు చేసుకువాడు. ఒకసారి కొంతమంది జాలరులు విసిరిన వలలో ఆయన పడతాడు. తమ అపరాధానికి మన్నించవలసిందిగా ఆ జాలరులు కోరతారు. జాలరులను నిరాశ పరచడం తనకి బాధను కలిగిస్తుందనీ, తనకి సమానమైనది ఏదైనా వాళ్లకు ఇవ్వమని రాజుకు చెబుతాడు చ్యవనమహర్షి.
ఆయనకి సమానమైనది ఏమిటో అర్థంకాక అయోమయంలో పడిన రాజు, వాళ్లకు గోవును ఇవ్వడానికి సిద్ధపడతాడు. తనకి సమానమైనది గోవు మాత్రమేననీ .. ఆ విషయాన్ని గుర్తించిన రాజును చ్యవన మహర్షి అభినందిస్తాడు. గోవులో సమస్త దేవతలు ఉంటారనీ .. గోవును పూజించడం వలన సమస్త దేవతలను సేవించిన ఫలితం దక్కుతుందని జాలరులతో చెబుతాడు. గోవును కంటికి రెప్పలా రక్షిస్తూ ఉండాలనీ, గోవును రక్షించడం వలన .. వాళ్లంతా కూడా రక్షించబడుతూ ఉంటారని అంటాడు. దాంతో ఆ జాలరులు సంతోషంతో తమ వెంట ఆ గోవును తీసుకెళతారు.