రావణుడికి బ్రహ్మదేవుడి శాపం
రావణుడు మహాశివుడి భక్తుడు .. సంగీత సాహిత్యాల్లో ఆయనకి మంచి ప్రవేశం వుంది. అలాంటి రావణుడు వరబల గర్వం చేత ఎంతోమంది ఆగ్రహానికి .. వారి శాపాలకు గురయ్యాడు. ఆ శాపాల కారణంగానే ఆయన యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయాడు. అలా రావణుడిని శపించినవారిలో బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు. తనకి వరాల నిచ్చిన బ్రహ్మదేవుడి నుంచే రావణుడు శాపానికి గురయ్యాడు.
ఒకసారి బ్రహ్మదేవుడి సమక్షంలో 'పుంజికస్థల'ను రావణుడు అవమాన పరుస్తాడు. దాంతో ఇష్టపడని పరస్త్రీలను తాకిన వెంటనే రావణుడి తల ముక్కలై మరణం సంభవిస్తుందని బ్రహ్మదేవుడు శపిస్తాడు. సీతాదేవిని అపహరించిన రావణుడు ఆ తల్లిని తాకకపోవడానికి ఆమె పాతివ్రత్యం ఒక కారణమైతే, బ్రహ్మదేవుడు రావణుడికి ఇచ్చిన శాపం మరొకటి. బ్రహ్మదేవుడు .. రావణుడికి ఇచ్చిన శాపం ఒక రకంగా సీతాదేవికి వరంగా మారిందనే మాట ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. ఇలా కొంతమంది దేవతలు .. మరికొంతమంది మహర్షులు ఇచ్చిన శాపం రావణుడి మరణానికి కారణమయ్యాయి.