భక్తుడి కోసమే వచ్చిన చిలకలపూడి పాండురంగడు

పాండురంగస్వామి లీలావిశేషాలు వింటే ఎంతటివారికైనా మనసంతా ఆ స్వామి పట్ల ఆరాధనాభావంతో నిండిపోతుంది. పాండురంగడు ఎంతోమంది భక్తులను అనుగ్రహించాడు .. ఆవిర్భవించాడు. ఆ సంఘటనలన్నీ కూడా ఆ స్వామి మహిమలుగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. అలాంటి కథ ఒకటి చిలకపూడి పాండురంగ స్వామి క్షేత్రంలో వినిపిస్తూ ఉంటుంది.

 పూర్వం మచిలీపట్నమునకు చెందిన నరసింహం అనే భక్తుడు తరచూ పండరీపురం వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తుండేవాడు. వయసు పైబడటంతో అంత దూరం వెళ్లలేకపోతున్నందుకు బాధపడ్డాడు .. తమ దగ్గర స్వామివారికి ఆలయం నిర్మించుకుంటే అనునిత్యం దర్శించుకోవచ్చని భావించాడు. ఎంతో కష్టపడి ఆలయం నిర్మించి .. అందులో కొలువై ఉండమని స్వామిని ప్రార్ధించాడు. స్వామి ప్రతిష్ఠకు నరసింహం ఏ ముహూర్తమైతే పెట్టుకున్నాడో సరిగ్గా అదే ముహూర్తానికి స్వామి గర్భాలయంలో ఆవిర్భవించాడు. అక్కడి ప్రజలంతా చూస్తుండగానే ఈ సంఘటన జరగడం విశేషం. ఈ కారణంగానే స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా వున్నాడని భక్తులు అంకితభావంతో ఆరాధిస్తూ తరిస్తుంటారు.   


More Bhakti News