ఇతరులకు సాయం చేసేవారిపట్లనే దైవానుగ్రహం

ఇతరులు కష్టాల్లో వున్నప్పుడు చాలామంది స్పందిస్తుంటారు .. తమకి తోచిన సాయాన్ని అందిస్తుంటారు. నిస్సహాయులైన వారికి సాయంగా నిలబడుతుంటారు. ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో వున్నవారికి తమకి తోచినంత సాయం చేస్తూ వుంటారు. తమ ఒక్కరి వల్లనే కాదనుకుంటే తమతో పాటు మరి కొందరిని ఆ సాయంలో భాగం చేస్తుంటారు. ఇక ఎవరైనా ఆపదలో వుంటే వాళ్లను కాపాడటానికి ఆరాటపడతారు. అనారోగ్యంతో బాధపడేవారి కోసం వెంటనే ముందుకు వస్తుంటారు.

 ఇక పశువులకు .. పక్షులకు కూడా ఆహారాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తారు. అలాంటివారి పట్ల భగవంతుడు కరుణను కలిగివుంటాడు. ఇలాంటివారి వలన మరికొంతమందికి సాయం అందాలనే ఉద్దేశంతో ఆయురారోగ్యాలను కలిగిస్తాడు. పశువుల .. పక్షుల పోషణ బాధ్యతను స్వీకరించినందుకు గాను, ఆ ఇంట ఆహార పదార్థాలకు లోటు లేకుండగా చూస్తాడు. మానవత్వం మచ్చుకైనా చూపించకుండగా .. స్వార్థంతో వ్యవహరించేవారి పట్ల దైవం కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తుంది. అందుకే భగవంతుడి నుంచి అవసరమైన సమయంలో సాయం అందాలంటే .. ఇతరులకు సాయపడుతూ పుణ్య ఫలాలను మూటగట్టుకోవలసిందే.        


More Bhakti News