ఆపదలో పడిన భక్తుడు .. రక్షించిన పాండురంగడు

నిజమైన భక్తులకు భగవంతుడే సర్వం .. ఆయనే వాళ్ల లోకం. ఆ స్వామి ఎడబాటును వాళ్లు ఎంతమాత్రం భరించలేరు. ఆయనకి నైవేద్యాలు సమర్పించనిదే వాళ్లు ఏమీ ముట్టరు. ఆ స్వామి లీలావిశేషాలను తలచుకుని వాళ్లు ఆనందంతో పొంగిపోతుంటారు. ఆ స్వామిని కీర్తిస్తూ ఆ తన్మయత్వంలోనే తరిస్తూ వుంటారు. అలాంటి భక్తులను ఆ దైవం ఓ కంట గమనిస్తూ కాపాడుతూనే ఉంటుంది. పాండురంగస్వామి భక్తుడైన 'జగమిత్రనాగుడు' విషయంలోనూ అదే జరిగింది.

నిజమైన భక్తులకు దొంగ భక్తుల నుంచి .. అధికారం చేతిలో వున్న అసూయపరుల నుంచి ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి. అలా అసూయపరుల బారిన పడిన భక్తులలో 'జగమిత్రనాగుడు' ఒకరుగా కనిపిస్తాడు. ఆయన పట్ల ద్వేషంతో కొంతమంది దుష్టులు ఒకరాత్రి వేళ ఆయన ఆశ్రమానికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో నిద్రలో వున్న ఆయన ఆ విషయాన్ని గమనించలేదు. కానీ తన భక్తుడు ఆపదలో వున్నాడని తెలుసుకున్న పాండురంగడు .. ఒక్కసారిగా ఆ ప్రదేశంలో వర్షం కురిపించి మంటలు ఆరిపోయేలా చేశాడు. తనని నమ్మిన భక్తులను తాను సదా రక్షిస్తూనే ఉంటాననే విషయాన్ని స్వామి మరోమారు నిరూపించాడు. తన భక్తుడికి ఆపద తలపెట్టినవారికి ఆయన గొప్పతనం తెలిసేలా చేశాడు.    


More Bhakti News