ఆంగ్లేయులను ఆశ్చర్యపరిచిన అవధూత
క్రీ.శ.16వ శతాబ్దంలో త్రైలింగస్వామి అనే ఒక అవధూత కాశీ క్షేత్రంలో ఉండేవారు. ఆయన ఎక్కువగా మౌనంలోను .. ధ్యానంలోను ఉండేవారు. నగ్నంగానే ఆయన ఆ కాశీ నగరంలో తిరుగాడుతూ ఉండేవారు. అది నచ్చని ఆంగ్లేయులు .. సామాజిక కట్టుబాట్లను మీరుతున్నాడనే నేరానికిగాను త్రైలింగస్వామిని చెరసాలలో వేశారు. అయితే చెరసాలలో ఉన్నట్టుగానే వుండి .. ఆ వెంటనే ఆయన బయటికి వచ్చేసేవాడు.
చెరసాలకు తాళం వేసి ఉండగా ఆయన ఎలా బయటికి వస్తున్నాడనే విషయం అర్థంకాక అధికారులు ఆశ్చర్యపోయేవారు. ఒక్కోసారి ఆయన బయట .. లోపల రెండు చోట్ల కూడా అధికారులకు కనిపించేవాడు. ఇది ఎలా సాధ్యమో అర్థంకాక అధికారులు తలలు పట్టుకున్నారు. ఒక రోజున త్రైలింగస్వామినే పిలిచి .. 'ఎలా బయటికి వెళుతున్నావు?' అని అడిగారు. తనని ఎవరూ బంధించలేరనీ .. అందుకు వాళ్లకి గల శక్తి సామర్థ్యాలు చాలవని ఆయన సమాధానమిస్తాడు. దాంతో ఆయన సాధారణ మానవుడు కాదని అందరూ చెప్పుకోవడంలో నిజం ఉందని భావించి .. సగౌరవంగా అక్కడి నుంచి పంపించివేస్తారు.