దోషాలను తొలగించే జాబాలీ తీర్థం

తిరుమల అనేక పుణ్యతీర్థాలతో దివ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఇక్కడి తీర్థాలు మహిమాన్వితమైనవిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి పుణ్యతీర్థాలలో ఒకటిగా 'జాబాలీ తీర్థం' కనిపిస్తుంది. మహాభక్తుడైన జాబాలీ ఈ ప్రదేశంలో చాలాకాలం పాటు తపస్సు చేసుకోవడం వలన, ఈ తీర్థానికి ఆయన పేరు వచ్చింది.

పూర్వం ఒక విప్రుడు గ్రహపీడల కారణంగా అనేక అవమానాలను పొందుతూ .. బాధలుపడుతూ ఉంటాడు. తనని ఈ కష్టాల నుంచి గట్టెక్కించువారెవరో తెలియక తోచిన దిశకి ప్రయాణం చేస్తూ ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. అలా ఆయన తిరుమల క్షేత్రానికి చేరుకొని .. ఆ కొండలలో నడుస్తూ స్పృహ తప్పి జాబాలీ తీర్థంలో పడిపోతాడు. నీళ్లు తాకిన వెంటనే ఆ విప్రుడు ఈ లోకంలోకి వస్తాడు. ఆ తీర్థ మహిమ కారణంగా ఒక్కసారిగా గ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. అక్కడే వున్న జాబాలీకి నమస్కరించి ఆ తీర్థ విశేషాన్ని గురించి .. ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి తెలుసుకుని బయలుదేరుతాడు. అందువలన తిరుమల వెళ్లిన భక్తులు 'జాబాలీ తీర్థం'ను తప్పకుండా దర్శించుకుంటూ వుంటారు.      


More Bhakti News