అతిని విడిచి పెట్టడమే అన్ని విధాలా మంచిది

కొంతమంది .. కొత్తగా ఎవరైనా పరిచయం కావడమే ఆలస్యం వాళ్లకు బాగా దగ్గరైపోతారు. అవతలివారి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్లతో చాలా చనువుగా వ్యవహరిస్తూ .. తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వుంటారు. ఇక మరి కొందరు ముందు వెనుక ఆలోచించకుండా దానధర్మాలు చేసేస్తుంటారు. దానం చేయడం మంచిదే అయినా .. తమ నుంచి దానాన్ని పొందుతోన్నవారు నిజంగానే కష్టాల్లో వున్నారా .. లేదంటే కష్టపడకుండా వచ్చిన డబ్బును ఖర్చుచేసే వ్యసనపరులా అనేది ఆలోచించరు. తమలోని దయా గుణం కారణంగా అవేమి పట్టించుకోకుండా చేతనైనంత దానం చేసేస్తుంటారు.

ఇక కొంతమంది తమ చుట్టూ ఉన్నవారిపై కోపాన్ని అధికంగా చూపిస్తుంటారు. తమకి నచ్చని పనులు ఎవరు చేసినా .. చిన్నపొరపాటే అయినా చాలా ఎక్కువగా స్పందిస్తూ వుంటారు. ఏ విషయంలోనైనా 'అతి' మంచిది కాదనేది పెద్దలమాట. అతిగా ప్రేమించడం .. అతిగా ద్వేషించడం .. అతిగా కోపించడం .. అతిగా దానాలు చేయడం .. అతిగా దయ చూపడం శ్రేయస్కరం కాదని అనుభవపూర్వకంగా సెలవిస్తుంటారు. అందువలన అన్ని విషయాల్లోను 'అతి'ని వదిలేసి, ప్రతి విషయంలోను మితమే హితమని గ్రహించాలని అంటారు. మితంగా ఉండటం వలన మనసు గాయపడటం ... అశాంతికి లోనుకావడం .. అసంతృప్తికి గురికావడం .. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురుకావడం జరగకుండా జీవితం సంతోషంగా .. సాఫీగా .. సంతృప్తికరంగా సాగిపోతుంది.          


More Bhakti News