కష్టం చెప్పుకుంటే కరిగిపోయే శివుడు

పరమశివుడు పరమ దయాసాగరుడు .. కష్టం చెప్పుకుంటే చాలు కరిగిపోయి కరుణించేస్తాడు. 'శివ' అనే శబ్దానికి శుభం .. మంగళం అనే అర్థాలు వున్నాయి. అంటే శివుడు .. శుభప్రదుడు .. మంగళప్రదుడుగా పూజలు అందుకుంటున్నాడు. శివుడు అభిషేక ప్రియుడు .. శుతోషుడు. దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఆదిదేవుడు ఆనందపడిపోతాడు. చాలా తేలికగా ఆయన సంతోష పడతాడు గనుకనే ఆయనను 'అశుతోషుడు' అని అంటారు.

అత్యంత భక్తి శ్రద్ధలతో శివ నామాన్ని స్మరిస్తూ .. ఆ స్వామికి అంకితభావంతో అభిషేకం చేయడం వలన .. బిల్వదళాలను సమర్పించడం వలన ఆయన సంతోషపడిపోతాడు. తన భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చడానికి ఆయన సిద్ధమైపోతాడు. ఆపదల బారిన పడకుండా .. అనారోగ్యాల బారిన పడకుండా వాళ్లను అనుగ్రహించేస్తాడు. తన భక్తుల విషయంలో పరమశివుడు ఎంతలా స్పందిస్తాడనడానికి నిదర్శనంగా మార్కండేయుడు వంటి ఎంతోమంది భక్తుల జీవితాలు కనిపిస్తాయి.   


More Bhakti News