పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానమే కైలాసగిరి

సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానంగా 'కైలాసగిరి' చెప్పబడుతోంది. నాలుగు త్రికోణాకార ముఖాలు కలిగిన గోపురంలా కైలాసగిరి దర్శనమిస్తూ .. మంచుతో అభిషేకం చేయబడిన శివలింగాన్ని గుర్తుకుతెస్తూ ఉంటుంది. అందుకే 'కైలాసగిరి' అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపించే కైలాసగిరిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ఆరాటపడుతుంటారు. ఆరోగ్యం సహకరించకపోయినా అక్కడికి వెళ్లేందుకు ఆసక్తిని చూపుతుంటారు.

 కైలాసగిరిపై ప్రత్యక్షంగా శివపార్వతులు వున్నారని భావించే భక్తులు, ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వుంటారు. కైలాసగిరి చుట్టు కొలత 32 మైళ్లు .. ఈ పర్వతానికి చేసే ప్రదక్షిణనే 'పరిక్రమ' అంటారు. స్పటిక రూపంలో ఈ పర్వతం కనిపిస్తుండటం వల్లనే 'కైలాస గిరి' అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇతిహాసాలకి .. పురాణాలకి సంబంధించిన ఎన్నో సంఘటనలు .. సన్నివేశాలు ఈ ప్రాంతంతో ముడిపడినవిగా కనిపిస్తాయి. పరమశివుడి లీలా విశేషాలకి తొలి వేదికగా అనిపిస్తాయి.      


More Bhakti News