అష్టలక్ష్ముల ఆరాధన ఫలితం

ఆదిలక్ష్మి .. ధాన్యలక్ష్మి .. ధైర్య లక్ష్మి .. ధనలక్ష్మి .. గజలక్ష్మి .. సంతాన లక్ష్మి .. విద్యాలక్ష్మి ..  విజయ లక్ష్మిలను అష్ట లక్ష్ములుగా భక్తులు భావిస్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజున అష్ట లక్ష్ములను ఆరాధిస్తూ వుంటారు. శ్రీమహా విష్ణువుకి .. కృష్ణావతారంలో ఎనమండుగురు భార్యలు. లక్ష్మీదేవియే ఎనిమిది అంశలతో అష్ట భార్యలుగా ఆ స్వామిని సేవించిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ ఎనమండుగురినే అష్టలక్ష్ములుగా అందరూ సేవిస్తుంటారు.

అష్ట లక్ష్ములకు భక్తులు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అష్ట లక్ష్ముల రూపాలు కలిగిన వెండి కలశం తమ ఇంట్లో తప్పకుండా ఉండేలా చూసుకుంటూ వుండటమే అందుకు నిదర్శనం. ఇక అష్టలక్ష్ములు కొలువైన ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఒక్కొక్క లక్ష్మీదేవిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. అష్ట లక్ష్ములలో ఏ ఒక్క లక్ష్మీదేవిని ఆరాధించినా మిగతా లక్ష్ముల అనుగ్రహం కూడా లభిస్తుంది ..   అష్ట లక్ష్ముల అనుగ్రహం కారణంగా సకల శుభాలు .. సంపదలు చేకూరతాయనేది మహర్షుల మాట.


More Bhakti News