దక్షిణావర్త శంఖాన్ని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం

లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది .. అందువలన శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతుంటారు. లక్ష్మీ స్వరూపం కనుకనే శంఖం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది అంటారు. అందుకే శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో పాటు శంఖాన్ని కూడా కలిగి ఉంటాడు. శంఖం ఎక్కడైతే వుంటుందో అక్కడ శ్రీమహా విష్ణువు వుంటాడు .. శ్రీమహావిష్ణువు ఎక్కడైతే వుంటాడో అక్కడ లక్ష్మీదేవి సిరి సంపదలను కురిపిస్తుంది.

శంఖంలో పోసిన జలం తీర్థమవుతుందనేది మహర్షుల మాట. అలాంటి తీర్థంతో అభిషేకం చేయడం వలన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు. శంఖాన్ని చూడటం వల్లనే సమస్త పాపాలు నశిస్తాయి .. శంఖంలోని తీర్థాన్ని తలపై చల్లుకోవడం వలన సమస్త నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. శంఖనాదం ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో .. అక్కడ లక్ష్మీదేవి కొలువై వుంటుంది. దక్షిణావర్త శంఖాన్ని పూజా మందిరంలో వుంచి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దక్షిణావర్త శంఖాన్ని పూజించినవారికి ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు .. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. 


More Bhakti News