శ్రీరాముని దగ్గర గల అస్త్రశస్త్రాలు

సీతాదేవిని రావణుడు అపహరించడంతో, ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు బయలుదేరారు. సీతాదేవిని రావణుడు అపహరించాడని తెలుసుకుని, వానరుల సాయంతో లంకా నగరానికి చేరుకున్నారు. సీతాదేవిని అప్పగించమంటూ రాముడు పంపించిన వర్తమానాలను రావణుడు లెక్కచేయలేదు. శ్రీరాముడితో యుద్ధం చేయడానికే నిర్ణయించుకుని, తన సేనలను పంపించాడు.

శక్తిమంతమైన నాయకుల పర్యవేక్షణలో దూసుకొస్తోన్న రావణ సైన్యాన్ని శ్రీరాముడి సైన్యం ఎదుర్కొంది. ఆ సమయంలో శ్రీరాముడి దగ్గర చాలా శక్తిమంతమైన అస్త్రశస్త్రాలు వున్నాయి. బ్రహ్మాస్త్రం .. బ్రహ్మశిర .. బ్రహ్మదండం .. ధర్మపాశం .. ధర్మచక్రం .. దండచక్రం .. దారుణాస్త్రం .. మోహనాస్త్రం .. సమ్మోహనాస్త్రం .. మాయామయాస్త్రం .. కాలపాశం .. కాలబాణం .. నాగబాణం .. అగ్నిబాణం మొదలైన అస్త్రాలతో శ్రీరాముడు శత్రు సైన్యాన్ని ఎదుర్కొన్నాడు.    


More Bhakti News