గీతోపదేశం ఈ చెట్టు కిందే జరిగిందట

కౌరవులకు .. పాండవులకు 'కురుక్షేత్రం' అనే ప్రదేశంలో యుద్ధం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని ఈ ప్రదేశంలోనే కౌరవులు .. పాండవులు తలపడ్డారు. పాండవుల వెన్నంటి వుంటూ ధర్మం జయించేలా చేయడంలో శ్రీకృష్ణుడు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. ఈ ప్రదేశంలోనే అర్జునుడికి శ్రీకృష్ణుడు 'గీతోపదేశం' చేశాడు. 'అంపశయ్య'పై వున్న భీష్ముడి దాహం తీర్చడానికి అర్జునుడు భూమిలోకి బాణాలు వేసింది కూడా ఇక్కడే.

ఈ ప్రదేశంలోనే ఒక పెద్ద 'మర్రిచెట్టు' కనిపిస్తూ ఉంటుంది. 'జ్యోతి సరోవరం' సమీపంలో ఈ మర్రిచెట్టు దర్శనమిస్తుంది. ఈ చెట్టు కిందనే గీతోపదేశం జరిగిందని అంటారు. ఆ పుణ్యఫల విశేషం కారణంగానే ఆ చెట్టు కాలాన్ని జయించిందని చెబుతుంటారు. గీతోపదేశం ఇక్కడే జరిగిందనడానికి గుర్తుగా అందుకు సంబంధించిన చిహ్నాలను అక్కడ ఏర్పాటు చేశారు. కురుక్షేత్రం వెళ్లినవారు తప్పకుండా ఈ మర్రిచెట్టును దర్శించుకుని నమస్కరిస్తూ వుంటారు .. అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంటారు.    


More Bhakti News