ఈ రోజున వరాహస్వామిని పూజించాలి

లోక కళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాలలో 'వరాహావతారం'ఒకటి. దశావతారాలలో 'వరాహావతారం' మూడవదిగా కనిపిస్తుంది. అలా స్వామివారు వరాహావతారంలో ఆవిర్భవించిన రోజు భాద్రపద శుద్ధ తదియ అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన స్వామివారు వరాహ రూపంలో అవతరించిన ఈ రోజున 'వరాహ జయంతి'ని జరుపుకుంటూ వుంటారు.

పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు .. భూమిని చాపగా చుట్టేసి సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు విష్ణుమూర్తి .. వరాహ రూపాన్ని ధరించి హిరాణ్యాక్షుడిని సంహరించి, భూమిని తన కోర కొమ్ములతో సముద్ర గర్భంలో నుంచి పెకైత్తాడని అంటారు. స్వామివారి ఈ రూపాన్నే భూ వరాహమూర్తి అనీ .. ఆది వరాహమూర్తి అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించుకోవడం వలన .. వరాహమూర్తిని పూజించడం వలన సమస్త పాపాలు నశించి, సకల శుభాలు చేకూరతాయనేది మహర్షుల మాట.    


More Bhakti News