శ్రీమహావిష్ణువు మూల మూర్తులు .. ఆరాధన ఫలితం
లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు అనేక అవతారాలను ధరించాడు. దుష్ట శిక్షణ చేస్తూ తన భక్తులను రక్షిస్తూ వస్తున్నాడు. అలాంటి శ్రీమహా విష్ణువు అనేక క్షేత్రాల్లో .. వివిధ నామాలతో పూజలు అందుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువు మూల మూర్తి ప్రతిమలు మూడు రకాలుగా కనిపిస్తాయి. స్వామివారు నిలబడి వుండే ప్రతిమలను స్థానమూర్తులనీ, కూర్చుని దర్శనమిచ్చే ప్రతిమలను ఆసన మూర్తులనీ, నిద్రిస్తున్నట్టుగా వుండే స్వామివారి ప్రతిమలను శయన మూర్తులని అంటారు.
ఈ మూడు మూర్తులు 'యోగ' .. 'భోగ' .. 'ఆభిచారిక మూర్తులుగా ఉంటాయి. యోగ రూపంలో గల శ్రీ మహా విష్ణువును .. యోగులు కొలుస్తుంటారు. ధర్మ బద్ధమైన కోరికలను నెరవేర్చుకోవాలనుకునేవారు భోగమూర్తిని పూజిస్తుంటారు. శత్రువులపై విజయాన్ని సాధించాలనుకునేవారు అందుకు అవసరమైన శక్తి కోసం ఆభిచారిక మూర్తిని ఆరాధిస్తూ వుంటారు.