ఇందిరా ఏకాదశి .. గోవత్స ద్వాదశి

ఏడాదిలో వచ్చే ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే .. ఆ రోజున చేసే విష్ణు పూజ విశిష్టమైనదే. అలాంటి ఏకాదశులతో 'ఇందిరా ఏకాదశి' ఒకటి. ఈ రోజున శ్రీమహా విష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ .. ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాస దీక్షను చేపట్టి .. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి .. విష్ణు నామస్మరణతో జాగరణ చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రత విశేషం వలన పితృ దేవతలకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేది మహర్షుల మాట.

ఇక 'గోవత్స ద్వాదశి ' రోజున దూడతో కూడిన ఆవును పూజించాలి. గోవు నుంచి వచ్చే పాలు .. పెరుగు .. నెయ్యి తో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోకూడదు. ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. ఈ విధంగా చేయడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.    


More Bhakti News