కార్తీకంలో ఉసిరిచెట్టు కింద పూజలు

వేదకాలంలో ప్రతి సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమయ్యేది. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసం కావడం వలన కార్తీకమాసం అనే పేరు వచ్చింది. విష్ణువుతో సమానమైన దేవుడు గానీ .. 'గంగ'తో సమానమైన తీర్థంగాని .. కార్తీక మాసానికి సమానమైన మాసంగాని లేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసాన్ని ఉపవాసాల మాసమని కూడా అంటారు.

కార్తీకమాసంలో ప్రతి రోజు ఆధ్యాత్మిక పరమైన విశేషాన్ని కలిగి వుంటుంది. కార్తీకమాసంలో చేసే నదీ స్నానం .. ఉపవాసం .. పురాణ పఠనం .. దీపారాధన .. దీపదానం .. వనభోజనం విశేషమైన ఫలితాలను ఇస్తాయనేది మహర్షుల మాట. ఈ మాసంలో ఉసిరి చెట్టుకింద పూజలు చేసినవారిని యమధర్మరాజు కన్నెత్తి చూడడు. కార్తీకమాసంలో ఉల్లిపాయలు .. వెల్లుల్లి .. ఇంగువ .. గుమ్మడికాయ .. నువ్వులు .. శెనగలు .. పెసలు ఆహార పదార్థాలలో ఉపయోగించకూడదనే నియమం వుంది. ఈ మాసంలో ప్రతి రోజు సాయంత్రం శివాలయంలో 'నేతి దీపం' వెలిగించడం వలన అపమృత్యు భయాలు తొలగిపోతాయి.   


More Bhakti News