గుడిలో గంటను దానంగా ఇవ్వాలి
ఏ ఆలయంలోనైనా గంటను మోగించే .. ఆలయం తలుపులు తెరుస్తారు. భక్తులు గుడికి వెళ్లగానే 'గంట'ను మోగించి దైవానికి నమస్కరించుకుంటూ ఉంటారు. గంటను మోగించినప్పుడు వచ్చే ఓంకార తరంగ ధ్వని మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపుతుంది. ఇక ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల సన్నిధులలోను 'గంటలు' ఉంటాయి. ఆ గంటలను కూడా మోగించే దైవానికి మనసులోని కోరికలను చెప్పుకుంటూ ఉంటాము.
ఇక పూజా మందిరంలోను దైవానికి హారతి ఇచ్చేటప్పుడు .. నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు కూడా గంటను మోగిస్తుంటాము. గంటను మోగించడం వలన దుష్ట శక్తులు దరిదాపుల్లోకి రావనీ .. గంట శబ్దం వలన దేవతలు ప్రీతి చెందుతారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గంటను మోగించడం వలన .. దేవాలయంలో ఉపయోగించడానికిగాను 'గంట'ను దానంగా ఇవ్వడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరినప్పుడు ఆలయానికి 'గంట'లను మొక్కుబడులుగా చెల్లించే పద్ధతి కూడా చాలా చోట్ల కనిపిస్తుంది.