కార్తిక మాసంలో దానాలు .. ఫలితాలు
మాసాలలో పరమ పవిత్రమైనదిగా .. మహిమాన్వితమైనదిగా 'కార్తిక మాసం' కనిపిస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు .. వ్రతాలు .. దానాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. 'కార్తిక పౌర్ణమి' రోజున శక్తికొలది వెండిని దానం ఇవ్వాలి. అలాగే శక్తికొలది కొంతమందికైనా అన్నదానం చేయాలి. అనునిత్యం శివ కేశవులను ఆరాధిస్తూ .. బంగారం .. ఆవు- దూడ .. భూమి .. నూతన వస్త్రాలు .. దానం చేయాలి. బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.
ఈ మాసంలో పురాణాలను చదవడం వలన .. పురాణ గ్రంధాలను దానంగా ఇవ్వడం వలన కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇక బహుళ చవితి రోజున వినాయకుడిని పూజించి 'ఉండ్రాళ్లు' .. బహుళ షష్టి రోజున సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి స్కంద పురాణం దానంగా ఇవ్వాలి. ఈ విధంగా కార్తిక మాసంలో చేసే పూజల వలన .. దానాల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి