అష్టాదశ పురాణాలు .. శ్లోకాల సంఖ్య
అష్టాదశ పురాణాలు అనగా 18 పురాణాలు ... ప్రతి పురాణం ఎంతో విశేషాన్ని .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఒక్కోపురాణం తీసుకుంటే వాటిలోని శ్లోకాల సంఖ్య ఒక్కోలా ఉంటుంది. 'బ్రహ్మ పురాణం' 10,000 శ్లోకాలు .. 'పద్మ పురాణం' 55,000 శ్లోకాలు .. 'విష్ణు పురాణం' 23,000 శ్లోకాలు .. 'శివపురాణం' 24,000 శ్లోకాలు .. 'భాగవత పురాణం' 18,000 శ్లోకాలు .. 'నారదీయ పురాణం' 25,000 శ్లోకాలను కలిగి వున్నాయి.
'మార్కండేయ పురాణం' 9000 శ్లోకాలు .. 'భవిష్య పురాణం' 14,500 శ్లోకాలు .. 'అగ్నిపురాణం' 15,400 శ్లోకాలు .. 'బ్రహ్మవైవర్త పురాణం' 18,000 శ్లోకాలు .. 'లింగ పురాణం' 11,000 శ్లోకాలు .. 'వరాహ పురాణం' 24,000 శ్లోకాలు .. 'స్కంద పురాణం' 21,000 శ్లోకాలు .. 'వామన పురాణం' 10,000 శ్లోకాలు .. 'కూర్మ పురాణం' 17,000 శ్లోకాలు .. 'మత్స్య పురాణం' 24,000 శ్లోకాలు .. 'గరుడ పురాణం' 19,000 శ్లోకాలు .. 'బ్రహ్మాండ పురాణం' 12,000 శ్లోకాలను కలిగి వున్నాయి.