ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల పేర్లను స్మరించినా చాలు

పరమశివుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందాయి. సౌరాష్ట్రంలోని 'సోమనాథ లింగం'.. శ్రీశైలంలోని 'మల్లికార్జున లింగం'.. ఉజ్జయినిలోని 'మహా కాళేశ్వర లింగం' .. నర్మదా నదీ తీరంలోని ఓంకార పరమేశ్వరలింగం .. కేదార్ నాథ్ లోని జ్యోతిర్లింగం .. సహ్యపర్వత శిఖరాలలో ఒకటైన డాకినీ శిఖరాగ్రంలోని భీమశంకర జ్యోతిర్లింగం .. కాశిలోని 'విశ్వేశ్వర లింగం'.. 'త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం' .. వైద్యనాథ జ్యోతిర్లింగం .. గోమతీ ద్వారక దగ్గర గల 'నాగేశ్వర జ్యోతిర్లింగం' .. రామేశ్వర జ్యోతిర్లింగం .. దక్షిణ భారతంలోని ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం శివ నివాసాలుగా .. సాక్షాత్తు శివ స్వరూపాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలనేది మహర్షుల మాట. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల పేర్లను ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే స్మరిస్తారో, ఏడు జన్మలుగా వాళ్లను వెంటాడుతోన్న పాపాలు నశించి .. పుణ్యరాశి పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.      


More Bhakti News