శ్రీనివాసుడికి శనివారమంటే ఇష్టం

శ్రీనివాసుడు కొలువైన క్షేత్రాలు .. ఆలయాలు శనివారం రోజున మరింతగా భక్తుల రద్దీతో కనిపిస్తుంటాయి. శనివారమంటే శ్రీనివాసుడికి ఇష్టం కనుకనే, ఆ రోజున ఆ స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. శ్రీనివాసుడు తన ఆలయ నిర్మాణం చేయమని భక్తుడైన తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారం. స్వామివారు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం. భక్తులకు ఆయన తొలిసారిగా దర్శనమిచ్చిన రోజు కూడా శనివారమే.

ఇక శ్రీనివాసుడు .. పద్మావతిదేవిని వివాహమాడినది శనివారమే. శ్రీనివాసుడిని ఎవరైతే పూజిస్తూ .. సేవిస్తూ వుంటారో, వారి దరిదాపుల్లోకి రానని స్వామివారికి శనిదేవుడు మాట ఇచ్చినది కూడా శనివారమే. శ్రీనివాసుడికి శనివారమంటే ఇష్టం కనుకనే, ఆయన ఆయా కార్యాలు శనివారం జరిగేలా చూసుకున్నారు. అలాంటి శనివారం రోజున స్వామివారిని దర్శించుకోవడం వలన .. స్మరించుకోవడం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరతాయనేది మహర్షిల మాట.   


More Bhakti News