సదాశివుడికి ప్రీతికరమైన పూలు
పరమశివుడు భక్తులపట్ల చూపించే వాత్సల్యం అంతా ఇంతా కాదు. ప్రేమతో పూజిస్తే చాలు స్వామి పొంగిపోతాడు. అంకితభావంతో అభిషేకిస్తే చాలు ఆనందంతో అనుగ్రహిస్తాడు. సదాశివుడికి కొన్ని రకాల పూవులంటే ప్రీతి ఎక్కువ. ఆ పూలతో పూజిస్తే ఆయన సంతోషంతో తన భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. మల్లెలు .. విరజాజులు .. గులాబీలు .. సంపెంగలు .. పున్నాగలు .. నాగకేసరాలు .. గరికపూలు మొదలైన పూవులతో అర్చిస్తే ఆయన ప్రీతి చెందుతాడు.
ఎవరు తమ మనసులో ఏది కోరుకుని పూజించారో వెంటనే ఆ కోరిక నెరవేరేలా చూస్తాడు. అయితే అది ధర్మబద్ధమైన కోరిక అయ్యుండాలి. ఈ పూలతో స్వామిని పూజించడం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోవడమే కాకుండా, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆయురారోగ్యాలతో కూడిన ఆనందకరమైన జీవితం లభిస్తుంది. అందువలన పరమశివుడికి ఇష్టమైన పూలతోనే ఆయన్ని పూజించాలి .. అనునిత్యం ఆయనని సేవిస్తూనే తరించాలి.