ఆయురారోగ్యాలను ప్రసాదించే దత్తాత్రేయస్వామి వజ్రకవచం
అత్రి మహర్షి .. అనసూయ మాత కోరిక మేరకు దత్తాత్రేయుడు అవతరించాడు. దేవతలకు .. మహర్షులకు జ్ఞానాన్ని భోదించాడు. అలాంటి దత్తాత్రేయస్వామి తన భక్తులను అనేక రూపాలలో .. అనేక విధాలుగా పరీక్షిస్తుంటాడు. తన పరీక్షకి నిలబడిన భక్తులను ఆయన కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. దత్తాత్రేయస్వామిని ఏడుమార్లు తలచుకుంటే .. ఏడోసారికి ఆయన భక్తుల చెంతకి చేరుకుంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలాంటి దత్తత్రేయస్వామి చరిత్రను పారాయణం చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయి. ఇక స్వామివారి 'వజ్ర కవచం' చదువుకోవడం వలన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయస్వామివారి 'వజ్ర కవచం'ను మేడిచెట్టు క్రింద కూర్చుని చదువుకోవడం వలన ధనధాన్యాలు కలుగుతాయి. మారేడు చెట్టు క్రింద కూర్చుని చదవడం వలన సుఖ సంతోషాలు కలుగుతాయి .. రావిచెట్టు క్రింద కూర్చుని 'వజ్ర కవచం' చదవడం వలన ఆయురారోగ్యాలు చేకూరతాయి. తులసి మొక్క దగ్గర కూర్చుని ఈ వజ్రకవచాన్ని చదవడం వలన జ్ఞానము లభిస్తుంది.